Kamalkote Uri Grenade Explosion: జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరి (Uri) సెక్టార్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలో గల కమాల్‌కోట్ సైనిక శిబిరం (Kamalkote Army Camp) లో జరిగిన ఒక దురదృష్టకర ప్రమాదంలో ఇద్దరు భారతీయ జవాన్లు వీరమరణం పొందారు.
విధి నిర్వహణలో భాగంగా సైనికులు ఒకరి నుంచి మరొకరికి ఆయుధ పరికరాలను, గ్రెనేడ్లను అప్పగిస్తున్న (Handing over equipment) సమయంలో ప్రమాదవశాత్తు ఒక హ్యాండ్ గ్రెనేడ్ అకస్మాత్తుగా పేలిపోవడమే ఈ ఘోరానికి కారణమైంది.
Read also:Canada News: కెనడాలో విషాదం.. విధి నిర్వహణలో భారత సంతతి పోలీస్ అధికారి మృతి
మహారాష్ట్రకు చెందిన ఇద్దరు జవాన్లు దుర్మరణం
Uri Accidental Grenade Blast Kamalkote Army Camp Baramulla Two Soldiers Killed Maharashtra Chavan Vikram Arjun Jadhav
ఈ గ్రెనేడ్ పేలుడు ధాటికి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సైనిక బృందం వారిని హెలికాప్టర్ ద్వారా శ్రీనగర్‌లోని సైన్యానికి చెందిన 92 బేస్ ఆసుపత్రికి (92 Base Hospital) అత్యవసర చికిత్స నిమిత్తం తరలించింది. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వారు ఆసుపత్రికి చేరుకునే లోపే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వీరమరణం పొందిన ఇద్దరు జవాన్లు మహారాష్ట్రకు చెందిన వారిగా రక్షణ వర్గాలు గుర్తించాయి
- చవాన్ విక్రమ్ బాలకృష్ణ (నివాసం: ఐరోలి, మహారాష్ట్ర)
- అర్జున్ జాదవ్ రాజేంద్ర (నివాసం: షాపూర్, మహారాష్ట్ర)
Kamalkote Uri Grenade Explosion: ఉగ్రకోణం లేదు - ఆర్మీ ఉన్నత స్థాయి విచారణ
ఈ ఘటన జరిగిన వెంటనే సరిహద్దుల్లో కాసేపు అలజడి రేగినప్పటికీ.. ఇది పూర్తిగా యాక్సిడెంటల్ (ప్రమాదవశాత్తు) గా జరిగిన పేలుడేనని సైన్యం స్పష్టం చేసింది. “ఈ దుర్ఘటనలో ఎలాంటి ఉగ్రవాదుల ప్రమేయం కానీ, సరిహద్దు అవతలి శక్తుల హస్తం కానీ లేదు. నిత్యం జరిగే షిఫ్ట్ మార్పిడి, ఆయుధాల బదిలీ ప్రక్రియలోనే ఈ సాంకేతిక లోపం తలెత్తింది.” ఏదేమైనప్పటికీ, ఈ గ్రెనేడ్ ఏ విధంగా పేలింది? భద్రతా పరంగా ఏవైనా లోపాలు జరిగాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేసేందుకు భారత సైన్యం ఉన్నత స్థాయి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి (Inquiry) ఆదేశించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
మల్కాజ్‌గిరిలో దారుణం.. భార్య ప్రవర్తనపై అనుమానంతో కాల్చి చంపిన భర్త!

