Hyderabad Crime: హైదరాబాద్ నగరంలో ఒక ఘోర సంఘటన వెలుగుచూసింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఆమెను మాట్లాడుకుందాం అని పిలిచి తుపాకీతో కాల్చి చంపాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరికి చెందిన అరుణ్ అనే వ్యక్తికి పదేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. భర్త అరుణ్ పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆమె అతనికి దూరంగా జీవించడం ప్రారంభించింది.
Read Also : Pakistan Attacks Afghanistan:అఫ్గాన్‌పై బాంబుల వర్షం.. 11 మంది చిన్నారులు బలి!
Horrific incident in Malkajgiri: Husband shoots wife dead, suspecting her conduct!
Hyderabad Crime: మొదటి భార్య చెల్లెలితో సహజీవనం.. రెండో పెళ్లి
మొదటి భార్య దూరమైన తర్వాత, ఆమె చెల్లెలు ఉషారాణితో అరుణ్ సహజీవనం మొదలుపెట్టాడు. ఆపై ఐదు సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టలో ఉషారాణిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ మల్కాజ్‌గిరిలోని మారుతి నగర్‌లో ఒక ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉషారాణి మరొకరితో సన్నిహితంగా ఉంటోందని, ఫోన్లలో చాటింగ్ చేస్తోందని అరుణ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై గత కొన్ని నెలల నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
మాట్లాడుకుందాం అని పిలిచి ఘాతుకం
భర్త వేధింపులు, గొడవల కారణంగా ఉషారాణి కూడా అరుణ్‌కు దూరంగా ఉంటోంది. తనను కాదని దూరంగా వెళ్లడంతో భార్య మీద పగ పెంచుకున్న అరుణ్, ఎలాగైనా ఆమెను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఉషారాణిని ఒకచోటికి మాట్లాడుకుందాం అని పిలిచాడు. ఆమె రాగానే ఒక్కసారిగా తన వద్ద ఉన్న తుపాకి తీసి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డ ఉషారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉషారాణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోరానికి పాల్పడిన అరుణ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఉషారాణిని చంపడానికి అరుణ్ తుపాకిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు? అతనికి ఆ తుపాకి ఎవరిచ్చారు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
లండన్‌లో భవనం పైనుంచి పడి భారతీయ కుటుంబం మృతి.. ఆత్మహత్యా? హత్యా?

