Gas Price Hike: కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచడంపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయం సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందని ఆయన మండిపడ్డారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం ఆయన స్పందిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గ్యాస్ ధరలను ఒక్కసారిగా 30 నుండి 35 శాతం మేర పెంచడం వల్ల హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లతో పాటు వీధి వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులు తినే ఆహార పదార్థాల ధరలు కూడా దీనివల్ల పెరుగుతాయని, ఇది అంతిమంగా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారు ఈ ధరలతో కోలుకోలేని దెబ్బ తింటారని ఆయన అన్నారు.
Read Also: Supriya Sule Traffic Jam Video: MP సుప్రియా సూలేకే తప్పని ట్రాఫిక్ కష్టాలు.. వీడియో వైరల్
Uttam on Commercial Gas Price Hike
Gas Price Hike: ఎన్నికల రాజకీయాలపై ఎద్దేవా
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ధరలను నియంత్రించి, ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఇలా భారం మోపడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

