Vijayawada Durgamma temple: విజయవాడలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్‌మాల్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, కొంతమంది ఆలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు.
నకిలీ టికెట్లు సృష్టిస్తూ, దుర్గగుడి ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్న కొందరు కిలాడీల వ్యవహారం వరుసగా వెలుగులోకి వస్తోంది.
Read also: AP Weather Updates: ఏపీలో ఈ రోజు నుంచి 26 వరకు భారీ వర్ష సూచన.. IMD
Ticket irregularities at Kanaka Durga Temple: Two employees sacked.
Vijayawada Durgamma temple: వారం వ్యవధిలోనే రెండు ఘటనలు
ఆలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన దుర్గగుడి ఈవో (Executive Officer). వారం వ్యవధిలోనే ఇలాంటి రెండు దారుణ ఘటనలు వెలుగుచూడటంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈవో ఇచ్చిన అధికారిక ఫిర్యాదుల ఆధారంగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు రెండు వేర్వేరు FIRలను నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
గతంలో వెలుగుచూసిన నకిలీ రూ. 500 దర్శనం టికెట్ల వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న హోంగార్డ్ చంద్రశేఖర్‌ను సీపీ రాజశేఖర్‌బాబు ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఇక నిన్న శనివారం వెలుగుచూసిన తాజా టికెట్ల అక్రమాల ఘటనను ఈవో తీవ్రంగా పరిగణించారు. దీనికి బాధ్యులుగా తేలిన ఇద్దరు ఆలయ ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తూ, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

