TIME 100 List 2026: ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ (TIME Magazine) ప్రకటించిన 2026 సంవత్సరపు 'ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర' జాబితాలో భారతీయులు సత్తా చాటారు.
టెక్నాలజీ, సినిమా, ఆహార రంగాల నుంచి ముగ్గురు ప్రముఖులు ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
Read Also: Iran-America War: ట్రంప్ వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్‌లో జోష్: భారత్‌కు ఊరటనిచ్చే పరిణామాలు!
100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. 2026 సంవత్సరానికి గానూ భారత్ నుంచి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, నటుడు రణ్‌బీర్ కపూర్, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
TIME 100 List 2026: సినిమా, సంస్కృతిలో రణ్‌బీర్
రణ్‌బీర్‌పై టైమ్ మేగజైన్‌లో ప్రొఫైల్‌ను రాసిన నటుడు ఆయుష్మాన్ ఖురానా ఆయన నటనలోని లోతును విశేషంగా ప్రశంసించారు. “కొంతమంది నటులు వారసత్వం కోసం ప్రయత్నిస్తారు. మరికొందరు తమ కళ ద్వారానే వారసత్వంగా మారిపోతారు. రణ్‌బీర్ రెండో రకానికి చెందినవాడు” అంటూ కొనియాడారు. భారతీయ సినిమాల్లో గొప్పతనాన్ని సాధారణంగా బాక్సాఫీస్ వసూళ్లు, అభిమానుల హంగామాతో కొలుస్తారని, అయితే రణ్‌బీర్ మాత్రం ప్రేక్షకుల భావోద్వేగాలను వ్యక్తపరిచే విధానాన్నే మార్చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. రణ్‌బీర్‌ను కేవలం స్టార్‌గా కాకుండా, రామాయణ వంటి భారతీయ పురాణాల నుంచి స్ఫూర్తి పొందిన గొప్ప కథకుడిగా వర్ణించారు. మన సంస్కృతిని నిశ్శబ్దంగా, సహజంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న వారధిగా టైమ్ మేగజైన్ ఆయనను ప్రశంసించింది.
TIME 100 Most Influential 2026
టెక్ రంగంలో సుందర్ పిచాయ్ ముద్ర
‘టైటాన్స్’ కేటగిరీలో స్థానం పొందిన సుందర్ పిచాయ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ఆయన అందిస్తున్న నాయకత్వానికి గుర్తింపు పొందారు. గూగుల్ సెర్చ్, ఆండ్రాయిడ్, క్రోమ్ వంటి ఉత్పత్తుల్లో ఏఐ టూల్స్‌ను విజయవంతంగా అనుసంధానించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పోటీని తట్టుకుని ‘జెమినీ’ ప్లాట్‌ఫామ్‌తో గూగుల్‌ను ఏఐ రంగంలో ముందుంచుతున్నారని టైమ్ పేర్కొంది.
కళలతో ఆకట్టుకుంటున్న, వికాస్
చెఫ్ వికాస్ ఖన్నా కేవలం వంటల నిపుణుడిగానే కాకుండా మానవతావాదిగా, సాంస్కృతిక రాయబారిగా గుర్తింపు పొందారు. ఆహారాన్ని విభిన్న సంస్కృతుల మధ్య వారధిగా ఉపయోగిస్తూ, భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కొనియాడింది.
జాబితాలోని ఇతర ప్రముఖులు
2026 ‘టైమ్ 100’ జాబితాలో ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న పలువురు నాయకులు కూడా చోటు దక్కించుకున్నారు. వారిలో డొనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు), పోప్ లియో XIV (వాటికన్ అధినేత), జి జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు), బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని), మార్క్ కార్నీ (కెనడా ప్రధాని), అలాగే 2026 ఆర్టెమిస్ II మిషన్ కమాండర్ రీడ్ వైస్‌మాన్ వంటి ప్రముఖులు ఉన్నారు. సంస్కృతి, రాజకీయాలు, మానవ జీవన విధానాన్ని వినూత్నంగా మార్చుతున్న వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఈ జాబితాను రూపొందించినట్లు టైమ్ మేగజైన్ వెల్లడించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

