Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కప్ గెలిచిన తర్వాత కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కప్ గెలిచిన తర్వాత కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వార్త 1 week ago

Kohli : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-19 (IPL 2026) ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ తుది సమరంలో 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 75 పరుగులు చేసి జట్టుకు బ్యాక్-టు-బ్యాక్ టైటిల్‌ను అందించిన విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని కోహ్లి స్పష్టం చేశారు. ప్రతి మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించే బాధ్యతను తనొక్కడే మోయాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడే అద్భుతమైన యువ ఆటగాళ్లు, సీనియర్ల కలయికతో కూడిన బలమైన టీమ్ ఈసారి దొరకడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కొనియాడారు. మైదానంలోకి అడుగుపెట్టినప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉన్నానని, రన్ చేజింగ్‌లో ఏం చేయాలో స్పష్టమైన ప్రణాళికతో ఆడానని కింగ్ కోహ్లి పేర్కొన్నారు.

Read Also : ఇప్పటి వరకు IPL గెలిచిన జట్లు ఇవే..!!

 IPL 2026 Final

అవుతున్న ఆర్సీబీ స్పెషల్ వీడియో

ఐపీఎల్ ట్రోఫీని వరుసగా రెండోసారి ముద్దాడిన ఆనందంలో ఆర్సీబీ క్యాంప్‌లో సంబరాలు అంబరాన్ని తాకాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు మైదానంలో విరాట్ కోహ్లి తనదైన శైలిలో క్రేజీ డ్యాన్స్ స్టెప్పులతో రచ్చ చేశారు. యువ ఆటగాళ్లతో కలిసి విరాట్ చేసిన ఈ విక్టరీ డ్యాన్స్‌కు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను ఆర్సీబీ యాజమాన్యం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది. ‘కింగ్ ఇన్ హిస్ ఎలిమెంట్’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మైదానంలో పరుగుల వరద పారించడమే కాకుండా, సెలబ్రేషన్స్‌లోనూ తనదైన జోష్‌తో అభిమానులను ఉర్రూతలూగించడం కేవలం విరాట్‌కే సాధ్యమంటూ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఈ ఏడాది IPL ఎంతో ప్రత్యేకం ..ఎలాగో తెలుసా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha