Dailyhunt
Karimnagar Accident: బస్సు​-బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

Karimnagar Accident: బస్సు​-బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

వార్త 2 months ago

Karimnagar Accident: కరీంనగర్ జిల్లాలో సోమవారం ఒక తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీ బైపాస్ రోడ్డులో స్కూల్ బస్సు మరియు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Read Also: Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య

వివరాల్లోకి వెళితే

ఈ ప్రమాదంలో వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థులు గణేశ్ (22), సందీప్ రెడ్డి (20) అక్కడికక్కడే మృతి(Dead) చెందారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, ఇండికేటర్​ వేయకుండా, సిగ్నల్​ ఇవ్వకుండా బస్సు డ్రైవర్​ సడెన్​గా టర్న్​ తీసుకోవడంతో బైక్ బస్సును ఢీకొట్టిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గణేశ్ తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనతో మామిడాలపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Kurnool bus accident: ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha