Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటకలో బస్సు ప్రయాణం భారమే.. మహిళల ఉచిత స్కీమ్ వల్లే నష్టాలా?

కర్ణాటకలో బస్సు ప్రయాణం భారమే.. మహిళల ఉచిత స్కీమ్ వల్లే నష్టాలా?

వార్త 1 week ago

Karnataka private bus : కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం అప్పుడే సామాన్యుడి జేబుపై పడటం మొదలైంది. తాజాగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు టికెట్ ఛార్జీలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రూట్లను బట్టి 20 నుండి 30 శాతం మేర ఛార్జీలు పెరగబోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి.

అదనంగా రూ. 200 వరకు భారం

రాష్ట్రంలో డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 పెరగడంతో బస్సు యజమానులకు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీనివల్ల ఒక్కో సీటుపై సగటున రూ. 200 వరకు అదనపు భారం పడనుంది. ఉదాహరణకు బెంగళూరు నుండి బెల్గాం వరకు గతంలో రూ. 1,000-1,200 మధ్య ఉన్న ఛార్జీలు, ఇకపై రూ. 1,350 నుండి రూ. 1,400 వరకు చేరుకోనున్నాయి. అలాగే మంగళూరు, ఉడుపి మార్గాల్లోనూ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి.

Read Also:Petrol : పెట్రోల్ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

 Karnataka private bus

ఉచిత ప్రయాణం, పన్నుల వల్లే నష్టాలు

కర్ణాటక స్టేట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నటరాజ్ శర్మ మాట్లాడుతూ.. ఇప్పటికే అధిక రోడ్డు టాక్స్‌లు, మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా డీజిల్ ధరల పెంపుతో ఒక్కో బస్సుపై నెలకు అదనంగా రూ. 15,000 భారం పడుతుందని, అందుకే ఛార్జీలు పెంచక తప్పడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పన్నులు తగ్గించాలని లేదా సబ్సిడీలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha