CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే సి. జోసెఫ్ విజయ్ తన విలక్షణమైన శైలితో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన చెన్నైలోని సెయింట్ జార్జ్ కోట (సచివాలయం)లో ఆయన చూపిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also:Petrol : పెట్రోల్ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
TN CM Joseph Vijay Work Style
CM Vijay: సమయపాలనలో ‘దళపతి’ మార్క్
మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్, అధికార విధుల్లో సరికొత్త నిబద్ధతను చాటుకుంటున్నారు.ప్రతిరోజూ ఉదయం నిర్దేశిత సమయం కంటే 15 నిమిషాల ముందే ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌కు చేరుకుంటున్నారు.సాధారణ ముఖ్యమంత్రుల వలె కాకుండా, ఓ సామాన్య ప్రభుత్వ ఉద్యోగి లాగా తన ఇంటి నుంచే స్వయంగా లంచ్ బాక్స్ తెచ్చుకుంటూ ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. భోజన విరామ సమయంలోనూ బయటకు వెళ్లకుండా, తన ఛాంబర్‌లోనే లంచ్ ముగించి వెంటనే తిరిగి ఫైళ్ల పరిశీలనలో నిమగ్నమవుతున్నారు.సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ ‘లీడర్’ అనిపించుకునేలా విజయ్ అనుసరిస్తున్న ఈ సరికొత్త పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

