Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కట్ట కాలేదాకా బీజేపీ వీడను..!

కట్ట కాలేదాకా బీజేపీ వీడను..!

వార్త 5 days ago

Bandi Sanjay : తన కుమారుడిపై నమోదైన కేసు మరియు రాజకీయ విమర్శలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అత్యంత ఆవేశంగా, భావోద్వేగంతో స్పందించారు.

తన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ, కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. “నేనేంటో నా ప్రజలకు తెలుసు, నా పార్టీకి తెలుసు, నా కార్యకర్తలకు తెలుసు. కనుమూసినా కాషాయం కండువాలోనే ఉండాలనుకునే నిబద్ధత నాది. కట్టె కాలేదాకా సిద్ధాంతం కోసమే బతికే నిజాయతీ నాది. నాకు కొత్త పార్టీ పెట్టాలనే చెత్త ఆలోచన లేదు, అలాంటి చెత్త ప్రచారాలపై స్పందించాల్సిన అవసరమూ లేదు” అని బండి సంజయ్ తేల్చిచెప్పారు.

Read Also:Over Heatwave: మధ్యాహ్నం వేళ ప్రయాణాలు మానుకోండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు!

కన్నకొడుకును పోలీసులకు అప్పగించిన తండ్రిని!

తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు పరిణామాలపై స్పందిస్తూ.. చట్టం ముందు ఎవరైనా సమానమేనని సంజయ్ స్పష్టం చేశారు. “ఈ దేశంలో చట్టంపై గౌరవంతో, విచారణకు సహకరించాలనే ఉద్దేశంతో కన్నకొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించిన తండ్రిని నేను. నా కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నాడు. మాకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉంది” అని పేర్కొన్నారు. తనను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ఇది తన సమాధానమని ఆయన మండిపడ్డారు.

Bandi Sanjay : చనిపోతే బీజేపీ జెండా కప్పాలి.. అదే కార్యకర్త చివరి కోరిక

 A powerful press meet image of Union Minister Bandi Sanjay Kumar gesturing intensely during his speech

బీజేపీ కార్యకర్తల క్రమశిక్షణ, దేశభక్తి గురించి మాట్లాడుతూ.. “బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన సిపాయిలే. కరడుగట్టిన బీజేపీ కార్యకర్తను చివరి కోరిక ఏంటని అడిగితే.. తాను చనిపోయిన తర్వాత తన పార్థివదేహంపై బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటాడు” అని ఉద్వేగంగా మాట్లాడారు. నన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ ‘ఫేక్ మీడియా ఫ్యాక్టరీ’పై లీగల్ యాక్షన్

మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా లేని బీఆర్ఎస్ పార్టీ ఫామ్‌హౌస్‌లో కూర్చుని నీతులు చెబుతోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ నియంతృత్వ పాలనను అంతం చేసింది బీజేపీనేనని, ఆ కక్షతోనే కేటీఆర్ ఒక ‘ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీ’ని నడుపుతూ కోట్లాది రూపాయలతో తమపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు, ఆ కంటెంట్‌ను తొలగించేలా ఇప్పటికే హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించినట్లు బండి సంజయ్ వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నగర ప్రజల క్షేమమే ముఖ్యం:మ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha