Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మధ్యాహ్నం వేళ ప్రయాణాలు మానుకోండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు!

మధ్యాహ్నం వేళ ప్రయాణాలు మానుకోండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు!

వార్త 3 months ago

రాష్ట్రంలో ఎండల తీవ్రత మరియు వడదెబ్బ (హీట్ వేవ్) పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నందున, ఆయా ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా విద్యుత్ సరఫరా మరియు తాగునీటి ఎద్దడి రాకుండా చూడటంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎండల దృష్ట్యా పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

Read Also: Bandi Sanjay press meet: కొడుకు అరెస్ట్ పై బండి సంజయ్ స్పందన

 Over Heatwave

Over Heatwave: వైద్యారోగ్య శాఖకు అప్రమత్తత ఆదేశాలు

ప్రజలకు అందుబాటులో ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను ఉంచాలని వైద్యారోగ్య శాఖకు సీఎం కీలక సూచనలు చేశారు. వడదెబ్బ బారిన పడి ఆసుపత్రుల్లో చేరే వారికి తక్షణమే తగిన వైద్య సహాయం అందించేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.జిల్లాల్లోని తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ను సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎండల తీవ్రతను బట్టి జిల్లా కలెక్టర్లకు నిరంతరం దిశానిర్దేశం చేస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జాతీయ తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారుల ప్రభంజనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha