Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ మనుగడపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Read Also : Medak: మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్: నలుగురు సభ్యులు ఏకగ్రీవం!
CM Revanth Reddy harshly criticizes KCR’s family
Revanth Reddy: రేవంత్ రెడ్డి విమర్శల్లోని ముఖ్యాంశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.”కొత్త పార్టీల సంగతి పక్కన పెడితే, ఉన్న పార్టీని ఉంచుతారో లేక మూసివేస్తారో కేసీఆర్ తేల్చుకోవాలి. తెలంగాణ సాధన తర్వాత ఆ పార్టీ ఆవశ్యకత ముగిసింది. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు” అని బీఆర్ఎస్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
కుటుంబ పాలనకు స్వస్తి
2023 ఎన్నికల తీర్పుతోనే కేసీఆర్ కుటుంబ పాలన పట్ల ప్రజల విముఖత స్పష్టమైందని, ఆ కుటుంబానికి రాజకీయంగా కాలం చెల్లిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.పదేళ్ల అధికారంలో ఉన్న అహంకారం, అహంభావం వల్లే ప్రజలు వారికి దూరమయ్యారని, ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, కేవలం గతం మాత్రమే మిగిలి ఉందని విశ్లేషించారు.కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలకు ఆస్తుల పంపకాల్లో వచ్చిన మనస్పర్థలే,కారణమని ఆ ఇంటి కుంపటిని కాంగ్రెస్ మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
రాజీనామా ర్యాలీతో హీట్ పెంచిన కాంగ్రెస్… బిఆర్ఎస్‌కు సవాల్ విసిరిన నరేందర్ రెడ్డి!

