Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవిత పార్టీ ప్రకటన సభలో వంటకాలు అదుర్స్ !!

కవిత పార్టీ ప్రకటన సభలో వంటకాలు అదుర్స్ !!

వార్త 2 months ago

తెలంగాణ రాజకీయాల్లో నేడు ఒక కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. ఎమ్మెల్సీ కవిత ఈ ఉదయం 10 గంటలకు తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇందుకోసం మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్ పరిధిలో సుమారు 20 ఎకరాల సువిశాల స్థలంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా తన రాజకీయ దిశను, పార్టీ జెండా, ఎజెండాను ఆమె ప్రజల ముందుకు తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుండి దాదాపు 50 వేల మందికి పైగా జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలిరానుండటంతో మేడ్చల్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీ శ్రేణులతో కోలాహలంగా మారాయి.

Read Also : Budhera Flyover Accident: బుదేరా ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. యువకుడు మృతి

 Kavitha’s New Party

అతిథుల కోసం నోరూరించే విందు – 34 రకాల వంటకాలు

ఈ సభ కేవలం రాజకీయ ప్రకటనకే పరిమితం కాకుండా, వచ్చిన కార్యకర్తలకు భారీ విందును కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏకంగా 34 రకాల వంటకాలతో మెనూను సిద్ధం చేశారు. ముఖ్యంగా మాంసాహార ప్రియుల కోసం తలకాయ కూర, బోటి, నాటుకోడి పులుసు, మటన్ కర్రీ వంటి ఐటమ్స్‌తో పాటు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ చికెన్ ధమ్ బిర్యానీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కార్యకర్తలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా వందలాది మంది వంట మాస్టర్లు, వడ్డించే సిబ్బందిని ఈ విందు కోసం నియమించారు.

తెలంగాణ రుచులు – పిండివంటల సందడి

ప్రధాన వంటకాలతో పాటు తెలంగాణ ప్రత్యేకం అనదగ్గ పిండివంటలు ఈ సభలో నోరూరిస్తున్నాయి. గ్రామీణ రుచులైన మక్క గారెలు, సర్వపిండి వంటి స్నాక్స్ నుంచి తీపి పదార్థాలైన జిలేబీ, బూరెలు, అరిసెలు వరకు అన్నీ మెనూలో చేర్చారు. ఒకవైపు రాజకీయ వేడి, మరోవైపు ఘుమఘుమలాడే వంటకాలతో మునీరాబాద్ సభ ప్రాంగణం ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. భారీ స్థాయిలో తరలివస్తున్న కార్యకర్తల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా, ఈ విందు ఏర్పాట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..పూర్తి లిస్ట్ ఇదే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha