Dailyhunt
కవిత 'పిట్టల దొరసాని': ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్

కవిత 'పిట్టల దొరసాని': ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్

వార్త 1 week ago

Dharmapuri Arvind: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRS) ఆవిర్భావం పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శనివారం మీడియా సమావేశంలో కవితపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు ‘పిట్టల దొర’ను చూశారని, ఇప్పుడు ఈ ‘పిట్టల దొరసాని’ని చూస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీనేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read Also:Narsapur: నర్సాపూర్ మున్సిపాలిటీ నగరాభివృద్ధికి అభివృద్ధికి రూ.15కోట్లు

 Dharmapuri Arvind, Kalvakuntla Kavitha

Dharmapuri Arvind: అజారుద్దీన్ ఎమ్మెల్సీ నియామకంపై స్పందన

గవర్నర్ కోటాలో మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నియమితులవ్వడంపై కూడా అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అజారుద్దీన్ అదృష్టం బాగుంది కాబట్టే ఆయన మంత్రి అయ్యారు. ఆ ఎమ్మెల్సీ నియామకం అనేది పూర్తిగా గవర్నర్ పరిధిలోని అంశం, ఆయన తీసుకున్న నిర్ణయం” అని పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన గడువు ముగియడానికి ముందే అజారుద్దీన్‌కు లైన్ క్లియర్ అవ్వడం ఆయన అదృష్టమని అభిప్రాయపడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కోదండరామ్, అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha