Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోదండరామ్, అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం

కోదండరామ్, అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం

వార్త 2 months ago

Telangana: తెలంగాణ కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్‌పై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీంతో ప్రొఫెసర్ కోదండరామ్, మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

గత ఏడాది ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ఫైల్‌పై ఎట్టకేలకు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Read Also:Ration Card e-KYC Update: రేషన్ కార్డు ఇ-కెవైసి అప్డేట్ చేసుకోండిలా

Telangana: సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించింది

ఈ నియామకం విషయంలో చోటుచేసుకున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చలు జరిపారు.అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా నియమించే ఫైల్‌ను క్లియర్ చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన గవర్నర్ తాజాగా వారిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తూ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.

 Kodandaram, Minister Azharuddin

ఆ వెంటనే వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గడువు ముగియడానికి కేవలం ఐదు రోజుల ముందే ఈ ఆమోదం రావడం విశేషం.ముఖ్యంగా ఏ సభలోనూ సభ్యుడిగా లేకుండానే గతేడాది నవంబర్‌లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంతో అక్కడ టికెట్ ఆశించిన అజారుద్దీన్‌కు ఏకంగా మంత్రి పదవి ఆఫర్ చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు అంటే ఏప్రిల్ 30 లోగా ఏదైనా ఒక సభకు ఆయన ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఒకవేళ ఈ గడువులోగా ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే ఆయన తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉండేది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రభుత్వ బడి విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఫోన్లకే వార్షిక ప్రోగ్రెస్ కార్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha