Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేకేఆర్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. అఫీషియల్‌గా ఇండియా టీమ్‌లోకి ఎంట్రీ

కేకేఆర్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. అఫీషియల్‌గా ఇండియా టీమ్‌లోకి ఎంట్రీ

వార్త 3 days ago

India A Squad: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్ క్యాంప్‌లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జార్ఖండ్ క్రికెటర్ అనుకుల్ రాయ్‌కు ఊహించని విధంగా టీమిండియా పిలుపు వచ్చింది.

త్వరలోనే శ్రీలంక వేదికగా జరగబోయే ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన అతడిని ఎంపిక చేశారు. గురువారం సెలక్షన్ కమిటీ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ప్రధాన భారత జట్టుకు ఎంపికైన హర్ష్ దూబే స్థానంలో అనుకుల్ రాయ్‌ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారు. లంక టూర్‌కు అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి సరైన ఆటగాడి కోసం చూసిన సెలక్టర్లకు కేకేఆర్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపించాడు.

Read also: Kavya Maran: కావ్య మారన్ అనిరుధ్ పెళ్లి వార్తలు నిజమేనా?

 India A Squad Anukul Roy Entry news

India A Squad:వికెట్లతో చెలరేగిన కేకేఆర్ స్టార్

27 ఏళ్ల అనుకుల్ రాయ్‌కు లభించిన ఈ అవకాశం వెనుక అతడి అద్భుతమైన ఫామ్ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న అనుకుల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 వికెట్లు పడగొట్టడమే కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించాడు. దీనికి తోడు 2025-26 దేశవాళీ సీజన్‌లో జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీలో కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 29 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలోనూ 49 సగటుతో, 122 స్ట్రైక్ రేట్‌తో 245 పరుగులు చేసి పవర్‌ఫుల్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనే అతడికి ఇప్పుడు ఇండియా-ఎ జట్టులో స్థానం సంపాదించి పెట్టింది.

India A Squad: జూన్ 9 నుంచి లంకలో ముక్కోణపు పోరు

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే జూన్ మొదటి వారంలో ఇండియా-ఎ జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్-ఎ మూడో జట్టుగా బరిలోకి దిగుతోంది. జూన్ 9 నుంచి జూన్ 19 వరకు దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో మొత్తం 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టూర్‌కు యువ సంచలనం తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు మోయనున్నాడు. తుది జట్టులో తిలక్ వర్మ, రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అనుకుల్ రాయ్ లాంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఈ సిరీస్ లో యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశం దక్కింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha