Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మీరు అసహ్యంగా ఉన్నారు, మమ్మల్ని వదిలేయండి'.. సారా టెండూల్కర్

'మీరు అసహ్యంగా ఉన్నారు, మమ్మల్ని వదిలేయండి'.. సారా టెండూల్కర్

వార్త 3 days ago

Sara Tendulkar Instagram Post: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, ఒక సోషల్ మీడియా పేజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనను, తన వదినను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలతో ఒక రీల్ పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. ఈ ఘటనపై సారా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఘాటుగా స్పందించారు.

ఒక ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్.. సారా టెండూల్కర్, ఆమె వదిన ఉన్న వీడియోను ఒక అభ్యంతరకరమైన క్యాప్షన్‌తో నెట్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ను గమనించిన సారా, దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మీరు అసహ్యంగా ఉన్నారు. ఇది జర్నలిజం కాదు. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సారా స్పందనతో భయపడిన ఆ పేజ్ యాజమాన్యం తక్షణమే ఆ వివాదాస్పద పోస్ట్‌ను డిలీట్ చేసింది.

Read Also : Rohit Sharma Fitness: రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం

 Sara Tendulkar is serious about her social media account.

Sara Tendulkar Instagram Post: పోస్ట్ డిలీట్ చేసినా వదల్లేదు.. మరో స్టోరీతో కౌంటర్

సదరు పేజీ తన తప్పును తెలుసుకుని పోస్ట్‌ను తొలగించినప్పటికీ సారా టెండూల్కర్ అంతటితో వదిలిపెట్టలేదు. ఆ పేజీని ట్యాగ్ చేస్తూ మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేశారు. “మీరు ఇప్పుడు ఆ పోస్ట్‌ను డిలీట్ చేసి ఉండొచ్చు, కానీ దానివల్ల మీ అసహ్యకరమైన ప్రవర్తన, ఆలోచనా విధానం ఏమాత్రం మారదు” అని సారా స్పష్టం చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టే వారిపై నెటిజన్లు కూడా సారాకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇటీవలే సారా సోదరుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ వివాహం ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సానియా చందోక్‌తో మార్చి 5న అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను సారా టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫ్యామిలీ వీడియోలను ఆసరాగా చేసుకుని కొన్ని సోషల్ మీడియా పేజీలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సారా ఈ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కావ్య మారన్ అనిరుధ్ పెళ్లి వార్తలు నిజమేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha