Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!

వార్త 2 weeks ago

Ajmer Car Fire Accident Borada: అజ్మీర్ జిల్లా బోరాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ అయిన రామ్‌సింగ్ చౌదరి తల్లికి అకస్మాత్తుగా గుండెనొప్పి (Heart Attack) వచ్చింది.

దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు కారులో వేగంగా బయలుదేరారు.

Read Also :Kovur Padugupadu Bus Accident: కోవూరు వద్ద ఘోర ప్రమాదం..జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!

మృత్యుపాశంగా మారిన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్

 Rajasthan Road Accident News Today

కారు ఆసుపత్రికి వెళ్తున్న మార్గమధ్యంలో.. ఊహించని విధంగా కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగావు. క్షణాల వ్యవధిలోనే ఆ మంటలు కారు మొత్తం వ్యాపించాయి. లోపల ఉన్నవారు అప్రమత్తమై బయటకు వచ్చేలోపే కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ (Central Locking System) జామ్ అయిపోయింది. తలుపులు తెరుచుకోకపోవడంతో కారు లోపల ఉన్న రామ్‌సింగ్ చౌదరి, ఆయన భార్య, ఆయన తల్లి మరియు జిల్లా పరిషత్ సభ్యురాలు పూసీ దేవి కారులోనే చిక్కుకుపోయారు. బయటకు వచ్చేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాంకేతిక లోపం వల్ల డోర్లు లాక్ అయిపోవడంతో, మంటల ధాటికి నలుగురూ కారులోనే సజీవ దహనమయ్యారు.

Ajmer Car Fire Accident Borada: పోలీసుల దర్యాప్తు

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బోరాడ పోలీసులు.. కారులో ఉన్న నలుగురు మృతి చెందినట్లు నిర్ధారించారు. కారు ఇంజిన్‌లో మంటలు ఎలా చెలరేగాయి? లాకింగ్ సిస్టమ్ విఫలం కావడానికి గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాల సహాయంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాంగ్రెస్ నేత కుటుంబం ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో మరియు గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భార్య, ఇద్దరు పిల్లలను చంపి కౌలు రైతు ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha