Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్ర ఆర్థిక మంత్రితో డిప్యూటీ సీఎం భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రితో డిప్యూటీ సీఎం భేటీ

వార్త 4 days ago

Bhatti Meets Nirmala Sitharaman: తెలంగాణ రాష్ట్ర మూలధన వ్యయం, విద్యా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తులు చేశారు.

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ అంశాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన ఎస్‌ఏఎస్‌సీఐ (SASCI – Scheme for Special Assistance to States for Capital Investment) కింద తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రూ. 5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని భట్టి విక్రమార్క కోరారు.

Read Also:Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు సెగలు.. ఢిల్లీ నిర్ణయంపైనే అందరి కళ్లు!

సంక్షేమ పథకాలు, 'యంగ్ ఇండియా' స్కూల్స్ గురించి వివరణ

 Requesting an additional ₹5,000 crore under the SASCI scheme for state capital expenditure

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరుల అభివృద్ధి కోసం చేపడుతున్న భారీ పెట్టుబడులను, అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర మంత్రికి డిప్యూటీ సీఎం వివరించారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ (YIIRS) వంటి విద్యా ప్రాజెక్టుల పురోగతిని ప్రస్తావించారు.

Bhatti Meets Nirmala Sitharaman: ఎఫ్‌ఆర్‌బీఎమ్ పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన డిప్యూటీ సీఎం

ఈ భారీ ప్రాజెక్టుల ఆర్థిక అవసరాల దృష్ట్యా.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) ఆమోదించిన విదేశీ ద్రవ్య సహాయక ప్రాజెక్టులకు (Externally Aided Projects – EAPs) సంబంధించి ఎఫ్‌ఆర్‌బీఎమ్ (FRBM – Fiscal Responsibility and Budget Management) పరిమితుల నుంచి తెలంగాణకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని భట్టి విక్రమార్క కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి లభించే అదనపు నిధులు, నిబంధనల సడలింపుల ద్వారా రాష్ట్రంలో మౌలిక వసతుల రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి వీలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

త్వరలోనే భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha