Dailyhunt
కేంద్ర కేబినెట్ ముందుకు అమరావతి బిల్లు.. అమిత్ షాతో వెంకయ్య నాయుడు భేటీ

కేంద్ర కేబినెట్ ముందుకు అమరావతి బిల్లు.. అమిత్ షాతో వెంకయ్య నాయుడు భేటీ

వార్త 3 weeks ago

శాశ్వత రాజధానిగా చట్టబద్ధత దిశగా అడుగులు

Amaravati Permanent Capital Bill: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అత్యంత కీలకమైన అడుగు పడబోతోంది.

అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ, పార్లమెంట్‌లో చట్టం ద్వారా రాజముద్ర వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏపీ కేబినెట్, అసెంబ్లీ ఈ మేరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపగా, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాజకీయంగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

Read Also:Chandrababu Naidu Speech: హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి మారుతుంది

Amaravati Permanent Capital Bill: అమిత్ షాతో వెంకయ్య నాయుడు చర్చలు

తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమరావతి బిల్లుకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని ఆయన కోరారు. 2015లో ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయం, ప్రస్తుత పరిస్థితులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

 Legal status for Amaravati Capital Bill

హోంమంత్రి సానుకూల స్పందన.. క్లియరెన్స్ పూర్తి

వెంకయ్య నాయుడు విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తన మంత్రిత్వ శాఖ (హోం శాఖ) నుండి కావాల్సిన అన్ని అనుమతులు, క్లియరెన్స్‌లు పూర్తయ్యాయని అమిత్ షా వెల్లడించారు. ఇప్పుడు ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ముందు ఉంచి ఆమోదం పొందడం ఒక్కటే మిగిలి ఉందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల అమరావతికి రాజ్యాంగబద్ధమైన రక్షణ లభించనుంది.ఇదే సమయంలో ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు సమయంలో.. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, రాజధాని నిర్మాణానికి కేంద్రం అందించిన ప్రారంభ సాయం గురించి వివరించారు.

అయితే 2019 తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, రాజధాని మార్పు ప్రయత్నాల వల్ల తలెత్తిన న్యాయపరమైన, పరిపాలనాపరమైన ఇబ్బందులను ఆయన హోంమంత్రికి వివరించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చట్టబద్ధమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దీంతో.. ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానం అందిన వెంటనే మిగిలిన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ వారంలోనే పార్లమెంట్ లో అమరావతి పైన చారిత్రక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎయిమ్స్ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha