CAPF Association: కేంద్ర సాయుధ పోలీస్ దళాల (సిఎపిఎఫ్ఎస్), సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటిబిపి, ఎన్ఎస్బిలకు చెందిన మాజీ సిఎపిఎఫ్ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ మాజీ సిఎపిఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ విజప్తి చేసింది.
సమస్యలు పరిష్కారించకపోతే సిఎపిఎఫ్ సిబ్బంది మనోబలం మాత్రమే కాకుండా దేశ భద్రతపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు.
Read Also: Telangana: తెలంగాణలో త్వరలో లెవెల్-4 ట్రామా కేర్ సెంటర్లు!
Solve CAPF issues
CAPF Association: సుప్రీంకోర్టు తీర్పుల అమలుపై అభ్యంతరం
ఆదివారం బషీర్ బాగ్ ప్రెసైక్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఆర్పిఎఫ్ రిటైర్డ్ డిజి వి. పురుషోత్తమరావు, సిఐఎస్ ఎఫ్ రిటైర్డ్ డిజి డి. శ్యామల, అసోసియేషన్ అధ్యక్షుడు కె. శ్యామసుందర్రెడ్డి తదితరులు మాట్లాడుతూ 13 సంవత్సరాల సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన సుప్రీంకోర్టు తీర్పులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా పార్లమెంట లో దొడ్డిదారిన ఒక బిల్లును ప్రవేశపెట్టి కోర్టు ఆదేశాలను లేక్క చేయక పోవడం రాజ్యాంగ వరిహాసమేనని, కేడర్ నిర్వహణ, ఇతర సేవలతో సమానత్వ ౦పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆనేక తీర్పులు అమలు చేయక పోవడం అన్యాయ మన్నారు.
‘శహీద్’ హోదా ఇవ్వాలని కేంద్రానికి విన్నపం.
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పదోన్నతుల్లో స్థబ్ధత, వృత్తి అసమా నతలను తొలగించాలని కోరారు. సిఎపిఎఫ్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) బిల్లు 2026కు సంబంధించి దళాలతో ఏలాంటి సంప్రదింపులు లేకుండా పార్లమెంట్ ఉభయ సభలు అమోదం పొందడం అధికార వికేంద్రీకరణ, కేడర్ అధికారుల హక్కుల హననం, భాగస్వామ్యులతో సరైన సంప్రదింపుల లోపం తీవ్రమైన ఆందోళనలు కలిగిస్తున్నదని, ఇవి దళాల స్వయం ప్రతిపత్తి, పనితీరును మరింతగా బలహీనపరచ వచ్చునన్నారు.
కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందికి ‘శహీద్’ హోదా ఇవ్వకుండా ఆపరేషనల్ క్యాజువాల్టీగా వర్గీకరించడం దారుణమన్నారు. వారి అత్యున్నత త్యాగానికి సరైన విధంగా గౌరవించాలన్నారు. మాజీ పారా మిలటరీ అధికారుల దీర్ఘకాలిక సమస్యలన పరిష్కారించేందకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
గచ్చీబౌలి స్టేడియంలో హెలిప్యాడ్.. ఒలింపిక్స్ లెవల్లో సీఎం రేవంత్ ప్లాన్

