Dailyhunt
తెలంగాణలో త్వరలో లెవెల్-4 ట్రామా కేర్ సెంటర్లు!

తెలంగాణలో త్వరలో లెవెల్-4 ట్రామా కేర్ సెంటర్లు!

వార్త 2 weeks ago

Telangana: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు తెలంగాణ సర్కార్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు అత్యవసర చికిత్స (గోల్డెన్ అవర్) అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా లెవెల్-4 ట్రామా కేర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.

Read Also:Suryapet Fine Rice Scam: సూర్యాపేట జిల్లాలో సన్నబియ్యం కుంభకోణం

 Level-4 Trauma Care Centers to be set up soon in Telangana!

Telangana: 911 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు

రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే 911 ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులను కాపాడేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా ప్రమాద స్థలం నుంచి ఆసుపత్రి వరకు పటిష్టమైన నెట్‌వర్క్ ఏర్పడుతుంది.

పక్కా నెట్‌వర్క్.. సత్వర వైద్యం

రోడ్డు ప్రమాదం జరిగిన తక్కువ సమయంలోనే బాధితులను పెద్ద ఆసుపత్రులకు తరలించేలా ప్రత్యేక కారిడార్లను, వైద్య సదుపాయాలను ప్రభుత్వం అనుసంధానిస్తోంది. నిపుణులైన వైద్యులు, అత్యాధునిక పరికరాలతో ఈ ట్రామా కేర్ సెంటర్లు పనిచేస్తాయి. తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మద్యం ప్రియులకు షాక్: తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha