Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెప్టెన్సీ చేజారినా భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన సూర్యకుమార్ యాదవ్

కెప్టెన్సీ చేజారినా భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన సూర్యకుమార్ యాదవ్

వార్త 1 week ago

Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

బీసీసీఐ సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్‌కు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, సూర్యకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భారత క్రికెట్ జట్టు ఫొటోను షేర్‌ చేస్తూ క్రేజీ పోస్ట్ పెట్టాడు. ''ఎంతో ప్రతిభావంతులైన ఈ ఆటగాళ్ల బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాబోయే సవాళ్లలో ఈ జట్టు ఘన విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను'' అని సూర్యకుమార్ రాసుకొచ్చాడు. కెప్టెన్సీ చేజారినప్పటికీ జట్టు పట్ల అతడు చూపిన క్రీడాస్ఫూర్తిని క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Read Also : AP Mega DSC: డీఎస్సీపై వదంతులు నమ్మొద్దు.. అభ్యర్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన!

 Suryakumar Yadav wishes the Indian cricket team well despite losing the captaincy

Suryakumar Yadav: వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు

సూర్యకుమార్ యాదవ్ తన మరో పోస్ట్‌లో టీమిండియాకు ఎంపికైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందించాడు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ భారత సీనియర్ జట్టుకు ఎంపికవ్వడంపై సూర్య తీవ్ర హర్షం వ్యక్తం చేశాడు. ''నువ్వు ఈ అద్భుతమైన అవకాశాన్ని నీ కష్టంతోనే సంపాదించుకున్నావు. అంతర్జాతీయ స్థాయిలో నీ క్రికెట్ ప్రయాణాన్ని చూడటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు చేసి రికార్డు సృష్టించిన వైభవ్‌ను సూర్య మనస్ఫూర్తిగా అభినందించడం విశేషం.

గత మార్చిలోనే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో సూర్య తీవ్రంగా ఫామ్ కోల్పోయాడు. ప్రపంచకప్‌లో కూడా అతను ఆశించిన స్థాయిలో రాణించలేక కేవలం 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెలెక్టర్లు భవిష్యత్తు లాంగ్ టర్మ్ ప్రణాళికల్లో భాగంగా సూర్యకుమార్‌ను సారథ్య బాధ్యతల నుంచి పక్కనబెట్టి, శ్రేయస్ అయ్యర్‌కు టీ20 కెప్టెన్సీ పగ్గాలను అప్పగించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కార్యకర్తలను నోరు మూసుకోవాలంటూ నాగబాబు వార్నింగ్.. ప్రకాశ్ రాజ్ కౌంటర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha