Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు

వార్త 2 weeks ago

Pinarayi Vijayan: కేరళ రాజకీయ వర్గాల్లో బుధవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విరుచుకుపడ్డారు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు.. కేరళ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో ఈ మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు.

 money laundering case

ఎక్కడెక్కడ సోదాలు సాగుతున్నాయి..?

మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె ఇల్లు, అలాగే కన్నూరులో ఉన్న ఆయన సొంత నివాసంలో ఉదయం నుంచే సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయన్ ఇళ్లతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) ఎండీ శశిధరన్ నివాసం, కేరళ మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్‌ ఇళ్లలోనూ ఈడీ బృందాలు విచారణ జరుపుతున్నాయి.

Read also: Cm vijay delhi tour: సీఎంగా విజయ్ నేడు తొలిసారి ఢిల్లీ పర్యటన..ప్రధాని మోదీతో భేటీ

Pinarayi Vijayan: రూ.1.72 కోట్ల అక్రమ నిధుల బదిలీ వివాదం!

ఈ సోదాలకు ప్రధాన కారణం సీఎంఆర్ఎల్ (CMRL) అనే ప్రైవేట్ ఖనిజ సంస్థ నుంచి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు అక్రమంగా నిధులు బదిలీ అయ్యాయనే ఆరోపణలే. వీణా విజయన్‌కు చెందిన ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్’ అనే ఐటీ కంపెనీ సదరు ప్రైవేట్ సంస్థకు ఎలాంటి సేవలు (Services) అందించకపోయినప్పటికీ.. సుమారు రూ.1.72 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ఇప్పుడు లోతుగా ఆధారాలు సేకరిస్తోంది.

హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో ఈడీ యాక్షన్!

ఈ కేసులో ఈడీ విచారణను అడ్డుకోవాలని, దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ కంపెనీ యాజమాన్యం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, న్యాయస్థానంలోని సింగిల్ బెంచ్ ఈ పిటిషన్లను కొట్టివేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తమకు కొంత సమయం కావాలని కంపెనీ చేసిన విజ్ఞప్తిని కూడా హైకోర్టు తిరస్కరించడంతో.. ఈడీ అధికారులకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం నుంచే అధికారులు ఈ దాడులు ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

సినీ రంగానికి విజయ్ గిఫ్ట్.. విశాల్ ఎమోషనల్ పోస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha