YSRCP Leader Kethireddy Pedda Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసం వద్ద చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.
మరో వైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయని పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని అనంతపురం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల దాడులకు నిరసనగా గాంధీ కూడలిలో దీక్ష చేస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. అయితే గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దాడులకు పాల్పడిన వారు ఇప్పుడు దీక్షలు చేయడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. పెద్దారెడ్డి దీక్షను అడ్డుకుంటామని జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గం హెచ్చరించడంతో ఉద్రిక్తత మొదలైంది.
Read Also: Anantapur: అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యేలు
Kethireddy Pedda Reddy
YSRCP Leader Kethireddy Pedda Reddy : పోలీసుల లాఠీఛార్జ్ – సిమెంట్ బెంచీలతో అడ్డంకులు
ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు పెద్దారెడ్డిని అనంతపురం తరలించడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసు వాహనాలకు అడ్డంగా సిమెంట్ బెంచీలు వేసి నిరోధించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోని ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ ఉంచారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కీలక కూడళ్లలో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

