జైలులో మొదలైన ప్రేమ కథ
Viral Love Story : మధ్యప్రదేశ్ లో ఓ ఆసక్తికరమైన ప్రేమ వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఫిరోజా ఖాతూన్ అనే మహిళ, అదే జైలులో జీవిత ఖైదు అనుభవించిన ధర్మేంద్ర సింగ్‌ను వివాహం చేసుకుంది.
ఈ ప్రేమకథ జైలులోనే మొదలైంది. 2007లో జరిగిన ఓ కౌన్సిలర్ హత్య కేసులో ధర్మేంద్ర సింగ్‌కు జీవిత ఖైదు పడింది. జైలులో ఉన్న సమయంలో వారెంట్ ఇన్‌ఛార్జిగా పనిచేసిన ఫిరోజాకు ధర్మేంద్ర పనుల్లో సహాయం చేసేవాడని తెలుస్తోంది.
స్నేహం నుంచి ప్రేమగా మారిన బంధం
జైలులో ఏర్పడిన పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ధర్మేంద్ర సింగ్ 14 ఏళ్ల శిక్ష అనంతరం 2021లో విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత కూడా వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మే 5న ఛతర్పూర్ జిల్లాలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక స్థానికంగా చర్చనీయాంశమైంది.
Read ALso : TVK విజయ్ విజయం వెనుక ప్రధాన సూత్రధారి అతడే !!
కుటుంబ వ్యతిరేకత మధ్య వివాహం
ఫిరోజా ఖాతూన్, ధర్మేంద్ర సింగ్ వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో కుటుంబ సభ్యులు (Viral Love Story) ఈ వివాహానికి అంగీకరించలేదని సమాచారం. అయినప్పటికీ ఫిరోజా తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు కూడా హాజరైనట్లు సమాచారం. మాజీ ఖైదీ, జైలు అధికారిణి వివాహం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఎన్నికల్లో ధనస్వామ్యం ఓడి ప్రజాస్వామ్యం గెలిచింది - విజయ్

