Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కిలో 5 రూపాయలేనా? మామిడి ధరలపై వైసీపీ నిరసన!

కిలో 5 రూపాయలేనా? మామిడి ధరలపై వైసీపీ నిరసన!

వార్త 2 weeks ago

Chittoor Mango farmers protest:తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పంటకు సరైన ధర లేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

దీనిపై స్పందించిన వైసీపీ నేతలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జ్యూస్ ఫ్యాక్టరీల ఎదుట ఆందోళన చేపట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో రైతులు భారీగా పాల్గొన్నారు.

Read also: Sai Krishna Missing Case: సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై అంబటి సంచలన వ్యాఖ్యలు

 Mango crop protest in AP

అన్యాయంగా తగ్గిన ధరలు

గత ఏడాది కిలో మామిడి పండ్లకు 12 రూపాయల ధర లభించింది. కానీ ఈ ఏడాది మాత్రం జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు కేవలం 4 నుండి 5 రూపాయలకే కొనుగోలు చేస్తున్నాయి. ఇంత తక్కువ ధర పలకడంతో రైతులు పెట్టుబడి ఖర్చులు కూడా రాక నష్టపోతున్నారు. ఫ్యాక్టరీల తీరును నిరసిస్తూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.

Chittoor Mango farmers protest:ప్రభుత్వం స్పందించాలని డిమాండ్

తోతాపురి మామిడి పండ్లకు కనీసం కిలో 15 నుండి 20 రూపాయల వరకు మద్దతు ధర ఇవ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రైతుల కష్టాన్ని గుర్తించి, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఫ్యాక్టరీ యజమానులతో చర్చలు జరిపి రైతులకు మేలు చేయాలని సూచించారు. రైతుల కష్టాన్ని వమ్ము చేయకుండా, వారికి న్యాయమైన ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సేంద్రియ వ్యవసాయమే రైతుకు భవిష్యత్‌ భరోసా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha