Dailyhunt
కిమ్ జాంగ్ ఉన్‌కు బెలారస్ అధ్యక్షుడి వింత కానుక

కిమ్ జాంగ్ ఉన్‌కు బెలారస్ అధ్యక్షుడి వింత కానుక

వార్త 3 weeks ago

Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్య జరిగిన భేటీ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్యాంగ్‌యాంగ్‌లో తొలిసారి పర్యటించిన లుకాషెంకో, కిమ్ జాంగ్ ఉన్‌కు ఒక ఆటోమేటిక్ రైఫిల్‌ను బహుమతిగా అందించారు.

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. “శత్రువులు కనిపిస్తే ఇది అవసరం పడుతుంది” అని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.

Read Also: Reliance Industries-Iran Crude Oil: ఇరాన్ చమురు కొనుగోలు వార్తలను ఖండించిన రిలయన్స్

Kim Jong Un: బదులుగా కిమ్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్

బెలారస్ అధ్యక్షుడు ఇచ్చిన గన్‌ను అందుకున్న కిమ్, దానిని లోడ్ చేస్తున్నట్లు సైగ చేస్తూ నవ్వుతూ “థాంక్యూ” చెప్పారు. దీనికి ప్రతిగా కిమ్ జాంగ్ ఉన్ కూడా ఒక అరుదైన బహుమతిని అందజేశారు. సుమారు 30 సముద్రపు గుల్లలతో తయారు చేసిన, లుకాషెంకో చిత్రం ఉన్న ఒక మొజాయిక్ ఫ్లవర్ వాజ్‌ను కిమ్ బహూకరించారు. ఈ భేటీకి సంబంధించిన వీడియోలను బెలారస్ అధికారిక మీడియా విడుదల చేసింది.

 Kim Jong Un Belarus President Alexander Lukashenko Rifle Gift

పశ్చిమ దేశాలపై ద్వజమెత్తిన ఇరు నేతలు

ఈ సమావేశంలో ఇద్దరు నేతలు పశ్చిమ దేశాలపై విమర్శలు గుప్పించారు. బెలారస్‌పై పశ్చిమ దేశాలు విధిస్తున్న ‘అక్రమ ఒత్తిడి’ని ఉత్తర కొరియా వ్యతిరేకిస్తోందని కిమ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను కొన్ని ప్రపంచ శక్తులు ఉల్లంఘిస్తున్నాయని లుకాషెంకో ఆరోపించారు.

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఈ రెండు దేశాలు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తుండగా, 2022లో దాడికి బెలారస్ తన భూభాగాన్ని లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగించుకునేందుకు అనుమతించింది. పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ రష్యా, చైనాలతో కలిసి ‘బహుళ ధ్రువ ప్రపంచం’ కోసం పనిచేస్తున్నామని ఇరు నేతలు పునరుద్ఘాటించారు. పర్యటన ముగింపులో కిమ్ స్వయంగా విమానాశ్రయం వరకు వచ్చి లుకాషెంకోకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్‌కు రష్యా రహస్య ఆయుధ సరఫరా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha