Keesara toll plaza : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ప్లయాస్ ట్యాంకర్ లారీ బోల్తా పడడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
సీనియర్ లాయర్ మృతి
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఏపీ, తెలంగాణ హైకోర్టుల సీనియర్ లాయర్ బొద్దులూరి శ్రీనివాసరావుగా గుర్తించారు. ఆయన హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ మారుతీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు.
బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు టోల్ చెల్లించేందుకు కీసర టోల్ ప్లాజా వద్ద ఆగింది. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వేగంగా వచ్చి అక్కడ నిలిపి ఉన్న కారుపై బోల్తా పడింది.
కారు పూర్తిగా ధ్వంసం
16 చక్రాల భారీ ట్యాంకర్ కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. టోల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన కారు బీఎండబ్ల్యూ (TS 6662). మొదట కారులో ముగ్గురు ఉన్నారని ప్రచారం జరిగినా, తరువాత అందులో శ్రీనివాసరావు ఒక్కరే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
Read Also:Mirzapur Lawyer Murder: రాజీవ్ సింగ్ దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చిచంపిన దుండగులు
Keesara toll plazaక్రేన్ల సాయంతో ట్యాంకర్ తొలగింపు
ప్రమాదం తర్వాత ట్యాంకర్ కారుపై పడిపోవడంతో దాన్ని తొలగించడానికి క్రేన్లు, జేసీబీలు ఉపయోగించారు.
ట్రాఫిక్‌కు అంతరాయం
ఈ ప్రమాదంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతించడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

