Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ కేబినెట్ భేటీ సడన్ గా వాయిదా.. అసలు కారణం ఇదేనా?

తెలంగాణ కేబినెట్ భేటీ సడన్ గా వాయిదా.. అసలు కారణం ఇదేనా?

వార్త 3 months ago

Telangana Cabinet meeting: ఈ నెల 21న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం తేదీ మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ తెలంగాణ ఇప్పుడు మే 23న హైదరాబాద్ లోని సచివాలయంలో నిర్వహించనున్నారు.

మే 21 నుంచి అత్యంత పవిత్రమైన సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం అవుతుండటంతో మంత్రులు అక్కడకు వెళ్లే అవకాశం ఉంది, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read also: Minister Seethakka: ఉన్నత పదవిలో ఉన్నా.. ఎల్‌ఎల్‌ఎమ్ ఎంట్రన్స్ రాసిన మంత్రి!

 Telangana Cabinet Meeting Updates News

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై చర్చ

జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అర్హులైన పేదలను ఎలా ఎంపిక చేయాలనే విధివిధానాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇళ్లను కేటాయించి నిజమైన లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సాయం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Telangana Cabinet meeting: కొత్త పెన్షన్లు సాగునీటి ప్రాజెక్టులపై నిర్ణయాలు

ఈ సమావేశంలో కేవలం ఇళ్లే కాకుండా కొత్త పెన్షన్ల మంజూరు, పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల వేగవంతంపై కూడా మాట్లాడనున్నారు. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ధరల సవరణ, ప్రభుత్వ శాఖల్లో పొదుపు చర్యలు అమలు చేయడం వంటి కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి తుది నిర్ణయాలు తీసుకుంటారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్.. ముగ్గురు యువకులు దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha