Dailyhunt
కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ ఆర్టీసీ MD

కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ ఆర్టీసీ MD

వార్త 1 week ago

Suryapet: సూర్యాపేట జిల్లాలోని కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ పర్యటనలో ఆయన బస్టాండ్ నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.

Read Also:Hyderabad: కిడ్నాపర్ల చెర నుండి చిన్నారిని కాపాడిన యువకుడు

Suryapet: మొక్కలు నాటి.. పరిసరాలను పరిశీలించి..

తనిఖీలో భాగంగా తొలుత కోదాడ డిపో ఆవరణలో ఎండీ నాగిరెడ్డి మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణలో ఆర్టీసీ పాత్రను చాటారు. అనంతరం బస్టాండ్ ఆవరణ అంతా కలియతిరిగారు. అయితే, బస్టాండ్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం గమనించిన ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రయాణికులు వేచి ఉండే ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలని, నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పల్లెకు బస్సు వెళ్లాలా కార్యచరణ చేపట్టాలని అధికారులకు సూచన చేసారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిందని ఎండీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ముహూర్తం ఫిక్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha