Ration Card e-KYC Update: రేషన్ కార్డు దుర్వినియోగాన్ని అడ్డుకు నేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు వినియోగ దారు లందరూ ఇకెవైస్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అర్హులైన లబ్దిదారులు తమ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవాలి. అలా చేయకపోతే కార్డును రద్దు చేస్తారు. ఇప్పటికే లక్షలాది రేషన్ కార్డులను ఇ-కెవైసి నిబంధనలు పాటించలేదనే కారణంతో రద్దు చేశారు.
Read Also : Kavitha: రాష్ట్రంలో పీకి కట్టలు కట్టామని అక్కడికి పోయారు: కేసీఆర్‌పై కవిత ఎద్దేవా
Update your ration card e-KYC.
Ration Card e-KYC Update: ఇకెవైసి ప్రక్రియ ద్వారా పారదర్శకత
ప్రభుత్వం అందించే ఉచిత రేషన్తో పాటు ఇతర పథకాలను పొందాలంటే.. రేషన్ కార్డు ఇకెవైసి తప్పనిసరి. అందుకని ప్రతి తమ ఆధార్ వివరాలను రేషన్ కార్డుతో అనుసంధానించి.. వేలిముద్రల ద్వారా ధృవీకరణ పూర్తి చేసుకోవా ల్సిందే. రేషన్ కార్డులో పేరున్న వారంతా ప్రస్తుతం జీవించే ఉన్నారా, వారి పేరు మీద ఒక్కటే కార్డు ఉందా, అనేక ప్రాంతాల్లో కార్డు జారీ చేశారా అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇకెవైసి ప్రక్రియ ద్వారా పారదర్శకత పెరుగుతుంది.
అప్డేట్ చేసుకునే విధానం
రేషన్ కార్డుదారులు తమ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి, అక్కడి డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రం ద్వారా తమ వేలిముద్రలను వేయాలి. దీనినే బయో మెట్రిక్ అథెంటికేషన్ అంటారు. ప్రభుత్వం నిర్ణ యించిన గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి పేర్లను కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మొత్తం కార్డునే రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలో ఈకేవైసీ అప్డేట్ చేయని కారణంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులను అధికారులు గుర్తించి తొలగించారు. వన్ నేషన్-వన్ రేషన్కార్డ్ పథకం ద్వారా మీరు ఉన్న దగ్గరలోని రేషన్ షాపులో ఇకెవైసి పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

