Bandi Sanjay press meet: తాను ఎలాంటి వాడినో తన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు బాగా తెలుసని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
గతంలో తన కుమారుడిపై నమోదైన పోక్సో (POCSO) కేసును ప్రస్తావిస్తూ.. చట్టం ముందు అందరూ సమానమేనని భావించి, తన కుమారుడిని తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని ఆయన గుర్తుచేశారు. దేశ రాజకీయాల్లో కన్న కొడుకును విచారణ కోసం పోలీసులకు స్వయంగా అప్పగించిన సందర్భం మరేదైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. న్యాయ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలనే ఉద్దేశంతోనే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Read Also : Jadcherla Vaishnavi Case: అమ్మాయిలకు మైనర్లకు రక్షణ ఏది?: ప్రవీణ్ కుమార్
Bandi Sanjay’s response to his son’s arrest
Bandi Sanjay press meet: బీజేపీ కార్యకర్తల కమిట్‌మెంట్ వేరు
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ, బీజేపీ లో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలేనని కొనియాడారు. పార్టీ కోసం క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసే ఏ సాధారణ కార్యకర్తనైనా ‘మీ చివరి కోరిక ఏమిటి’ అని అడిగితే.. “నేను చనిపోయిన తర్వాత నా భౌతికకాయంపై బీజేపీ జెండా కప్పాలి” అని గర్వంగా కోరుకుంటారని, అదీ తమ పార్టీ కార్యకర్తలకు ఉండే కమిట్‌మెంట్ అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
కుమారుడి కేసులో బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన మాజీ సీఎం కేసీఆర్ పార్టీ అయిన బీఆర్ఎస్‌కు ప్రస్తుతం లోక్‌సభలో కనీసం ఒక్క ఎంపీ కూడా లేరని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాబలం లేని ఆ పార్టీ నేతలు ఫామ్ హౌస్‌లో హాయిగా కూర్చుని తమపై ఏవేవో అడ్డగోలు విమర్శలు చేస్తూ ఉంటారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ సాగించిన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చింది, ఆ కుటుంబ అరాచక పాలనను అంతం చేసింది తామేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకునే, రాజకీయంగా తట్టుకోలేక తమపై ఇలాంటి అసత్య ఆరోపణలు, కుట్రపూరిత విమర్శలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

