Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోలీవుడ్ నటి, న్యూస్ రీడర్ ప్రియవదన ఆత్మహత్య

కోలీవుడ్ నటి, న్యూస్ రీడర్ ప్రియవదన ఆత్మహత్య

వార్త 8 hrs ago

Actress Priyavadana Suicide: కోలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రముఖ టీవీ ఛానల్ న్యూస్ రీడర్ ప్రియవదన గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇటీవల కాలంలో తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం ‘కరుప్పు’లో ఈమె కీలక పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. కొద్ది రోజుల క్రితమే తన 24వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకున్న ఆమె, ఇంతలోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం కోలీవుడ్ వర్గాలను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Prabhas Fouji Movie: ప్రభాస్ 'ఫౌజీ' అధికారిక గ్లింప్స్ విడుదల.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

 Kollywood actress and news reader Priyavadana dies by suicide

Actress Priyavadana Suicide: జర్నలిజం నుంచి వెండితెర వైపు ప్రియవదన ప్రయాణం

జర్నలిజం రంగంపై ఉన్న మక్కువతో టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించిన ప్రియవదన, తొలుత ‘వేందర్ టీవీ’లో న్యూస్ రీడర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రముఖ వార్తా ఛానల్ ‘తంతి టీవీ’లో ప్రెజెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ తమిళ ప్రేక్షకులకు అత్యంత సుపరిచితురాలయ్యారు. వార్తలను ఎంతో స్పష్టమైన శైలిలో చదువుతూ అతి తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

మీడియా రంగంలో రాణిస్తున్న తరుణంలోనే నటనపై ఉన్న ఆసక్తి ఆమెను సినిమాల వైపు నడిపించింది. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’లో నటించడం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి ప్రతిభ కనబరిచిన ఆమె, భవిష్యత్తులో నటిగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని అందరూ భావించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్.. ఊహించని నిర్ణయం!

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎంతో చురుగ్గా ఉండే ప్రియవదన.. నిత్యం సరికొత్త ఫోటోషూట్లు, వ్యక్తిగత ఆలోచనలు, వృత్తిపరమైన అప్‌డేట్లను నెటిజన్లతో పంచుకునేవారు. కొద్దిరోజుల క్రితమే ఆమె తన 24వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అలాగే కోయంబత్తూరులో దళపతి విజయ్ ప్రారంభించిన పెరియార్ సైన్స్ సెంటర్ గొప్పతనాన్ని వివరిస్తూ ఆమె ఇటీవల చేసిన పోస్ట్ నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంది. జీవితంపై ఎంతో ఉత్సాహం ప్రదర్శించిన యువతి ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఎవరికీ అంతుచిక్కడం లేదు.

చెన్నై ప్రెస్ క్లబ్ ప్రియవదన మృతిని అధికారికంగా ధ్రువీకరిస్తూ, ఆమె కుటుంబసభ్యులకు, తోటి జర్నలిస్టులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. అయితే, కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంటున్న సమయంలో ఆమె ఈ అడుగు ఎందుకు వేయాల్సి వచ్చిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది వ్యక్తిగత సమస్యలా? లేక వృత్తిపరమైన ఒత్తిళ్లా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నటిగా, యాంకర్‌గా ఉజ్వల భవిష్యత్తు ఉన్న ప్రతిభావంతురాలు అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్‌లో వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha