తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో కోళ్ల ఫారాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.
దీనివల్ల మార్కెట్‌కు కోళ్ల సరఫరా గణనీయంగా తగ్గింది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో వ్యాపారులు ధరలను భారీగా పెంచేశారు. గత వారంతో పోలిస్తే కేజీ చికెన్‌పై దాదాపు రూ. 20 నుండి రూ. 40 వరకు అదనపు భారం పడింది. ఎండల తీవ్రత తగ్గే వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని పౌల్ట్రీ యజమానులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : బొబ్బిలిగావ్‌లో "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమం విజయవంతం

ప్రాంతాల వారీగా ధరల వ్యత్యాసం
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ నగరాల్లో ధరలు భిన్నంగా ఉన్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, పిఠాపురం వంటి ప్రాంతాల్లో చికెన్ ధర కేజీ రూ. 300 మార్కును తాకింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, గుంటూరు, రాజమండ్రి వంటి నగరాల్లో రూ. 270 వరకు విక్రయిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే, హైదరాబాద్‌తో పాటు ప్రధాన జిల్లాల్లో ప్రాంతాన్ని బట్టి రూ. 260 నుండి రూ. 280 మధ్య ధరలు పలుకుతున్నాయి. స్కిన్‌లెస్ చికెన్ ధరలు కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
సామాన్యుడిపై భారము
ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు చికెన్ కొనాలంటేనే వెనకాడుతున్నారు. ధరల పెరుగుదల ప్రభావం విక్రయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఆదివారాల్లో కిటకిటలాడే చికెన్ సెంటర్లు, ఇప్పుడు ధరల దెబ్బకు వెలవెలబోతున్నాయి. కేజీ కొనేవారు అరకేజీతో సరిపెట్టుకుంటున్నారు. మరోవైపు, కోళ్ల మేత ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవ్వడం కూడా ఈ ధరల పెరుగుదలకు పరోక్ష కారణాలుగా మారుతున్నాయి. వేసవి గడిస్తే తప్ప చికెన్ ధరలు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేలా లేవు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

