Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సదాశివపేట మున్సిపాలిటీలో ముగిసిన కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక

సదాశివపేట మున్సిపాలిటీలో ముగిసిన కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక

వార్త 1 month ago

Sadashivpet Municipality: సదాశివపేట పురపాలికలో పూర్తయిన కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ… హాజరైన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ అధ్యక్షతన శనివారం నాడు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక గురించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ముందుగా ఊహించిన విధంగానే సదాశివపేట మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక ప్రక్రియ సాదాసీదాగా ముగిసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొత్తం కౌన్సిల్ సభ్యులలో 50 శాతం మంది అంటే 14 మంది సభ్యులు ఉంటే ఎన్నిక ప్రక్రియ చేపట్టవచ్చు అనే నిబంధనలతో మున్సిపల్ కమిషనర్ శివాజీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు.

Read Also: TG Inter Supplementary Exams 2026: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు!

Sadashivpet Municipality:రాజకీయ విమర్శలు – అయోమయం

ఎక్స్ ఆఫీసియో తో కలిపి 27 మంది సభ్యులకు గాను 16 మంది సభ్యులు హాజరు కావడంతో ఎన్నికల నియమ నిబంధనలను కమిషనర్ సభ్యులకు వివరించారు. పురపాలనలో అనుభవం కల కో ఆప్షన్ సభ్యుల పదవికి పురుషుల నుండి ఒకటి మహిళా విభాగం నుండి ఒకటి అవసరం కాగా నామినేషన్లు కూడా పురుషుల విభాగం నుండి మునిపల్లి సత్యనారాయణ, మహిళల విభాగం నుండి ఆగమామిడి అనంతమ్మ నామినేషన్ వేశారు. వీరి ఎన్నికకు కౌన్సిల్ సభ్యులు చేయి పైకెత్తి ఆమోదం తెలపడంతో వీరు ఎన్నికైనట్లు కమిషనర్ శివాజీ ప్రకటించారు.

 Co-option Members Election

అలాగే మైనారిటీ విభాగంలో ఖాళీగా ఉన్న రెండు ( ఒకటి మహిళలు ) కో ఆప్షన్ సభ్యులకు గాను పురుషుల నుండి రెండు, మహిళల నుండి ఒకటి నామినేషన్ దాఖలు కాగా మహమ్మద్ రహమత్ మరియు సీమ సుల్తానా సభ్యులకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపడంతో వీరు ఎన్నికైనట్లు కమిషనర్ శివాజీ ప్రకటించారు. ఈ సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇద్దరు సభ్యులు వచ్చినప్పటికీ ఒకరు వెంటనే వెళ్లి పోయారు. 24వ వార్డ్ కౌన్సిలర్ సమావేశంలో ఉన్నప్పటికీ వారు కొత్తవారు కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నుకోబడిన సభ్యులకు మద్దతు తెలుపుతున్నట్లు అయోమయ పరిస్థితిలో చేయి లేపినానని, అంతేకానీ నేను వారికి మద్దతు తెలుపలేదని అన్నారు.

ఇది తెలియని కాంగ్రెస్ పార్టీ వారు బి ర్ఎస్ పార్టీ నుండి ఒక అభ్యర్థి తమకు మద్దతు తెలిపినట్లు ప్రకటించుకున్నారు. అనంతరం ఎన్నిక కాబడిన సభ్యులకు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అంజమ్మ, కమిషనర్ శివాజీ పూలమాలలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. పాలనలు అనుభవం గల మీరు సదాశివపేట పట్టణ ప్రజలకు మంచి పాలన అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి వారికి సూచించారు. కో ఆప్షన్ సభ్యులుగా మా అభ్యర్థిత్వాన్ని సమర్థించి,మమ్మల్ని నియమించిన కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగ్గారెడ్డికి, నిర్మలారెడ్డికి, మా వెన్నంటి ఉండి మాకు సహకరించిన సదాశివపేట పట్టణ ముఖ్య కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఎన్నిక కాబడిన సభ్యులు అన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కుక్కల రక్తంతో దందా అనేది అబద్ధం.. పెట్స్ కేర్ ఛైర్మన్ వెంకట్ యాదవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha