Ganapavaram news: విషాదం.. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్.కొండేపాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆక్వా చెరువుల వద్ద పనులు చేసే 11 మంది కూలీలు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు.
మైదా పిండితో తయారు చేసిన బజ్జీలు తినడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆహారం వికటించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
Read also: Tirumala Darshan updates: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక గంటల్లోనే శ్రీవారి దర్శనం!
workers food poisoning news imageGanapavaram news: భీమవరం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
బజ్జీలు తిన్న కొద్దిసేపటికే కూలీలకు వరుసగా వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో తోటి పనులు చేసేవారు వెంటనే వారిని భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సకాలంలో ఆసుపత్రికి చేర్చడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
కోలుకుంటున్న బాధితులు.. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది కూలీలు ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కలుషిత ఆహారం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కూలీల ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు దైర్యంగా ఉన్నారు
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

