Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొంతమంది కావాలనే ప్రజల్లో భయాలు సృష్టిస్తున్నారు - నిర్మల

కొంతమంది కావాలనే ప్రజల్లో భయాలు సృష్టిస్తున్నారు - నిర్మల

వార్త 3 months ago

Nirmala Sitharaman : పశ్చిమాసియా సంక్షోభం (మిడిల్ ఈస్ట్ క్రైసిస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడి, దేశం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో..

కొందరు వ్యక్తులు కావాలనే ప్రజల్లో నెగటివ్ ప్రచారం చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు. ముంబైలో జరిగిన సిడ్బి (SIDBI) వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అంతర్జాతీయ ఒడిదొడుకుల దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వం F3 అంటే ఫ్యూయల్ (ఇంధనం), ఫెర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విदेशी మారక నిల్వలు) వంటి మూడు కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు గుర్తుచేశారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఎంతో బలంగా, స్థిరంగా ఉన్నప్పటికీ, కొంతమంది మేధావులు, విమర్శకులు అంతా కుప్పకూలిపోతోందనేలా లేనిపోని అపోహలను ప్రచారం చేస్తున్నారని ఆమె ఆక్షేపించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటూనే, దేశ ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా ఆమె హితవు పలికారు.

Read Also : సుప్రీం కోర్టుకు జూన్ 1 నుంచి వేసవి సెలవులు

ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో రూ. లక్ష కోట్ల భారం

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా సామాన్యులపై మరియు పారిశ్రామిక రంగంపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) భారీగా తగ్గించామని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన సుమారు రూ. లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆమె వెల్లడించారు. ఈ భారీ రెవెన్యూ నష్టాన్ని భరిస్తూనే, చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) దిగుమతులను నిలిపివేయకుండా ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిన్నదని, దాని ప్రభావం వల్లే దేశీయంగా ఇంధన ధరల సర్దుబాటు అనివార్యమైందని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని తక్కువ చేసి చూడవద్దని, ఇలాంటి సంక్షోభ సమయాల్లో అనవసరపు భయాలను వ్యాప్తి చేయకూడదని ఆమె కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం .. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha