Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోర్పోలులో దాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

కోర్పోలులో దాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

వార్త 3 months ago

Sangareddy: సంగారెడ్డి జిల్లా కోర్పోలు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరాపల్లి గ్రామానికి కలెక్టర్ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న రైతులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అం దజేశారు.

గ్రామంలో వరి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, రోజుల తరబడి ధాన్యం రాశులు అలాగే ఉండిపోయాయని చెప్పడంతో సరాఫ్పల్లి నుండి కలెక్టర్ కోర్పోలు గ్రామానికి వెళ్లారు. డీసీఎంస్ అధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రంలో సమయానికి తూకం వేయడం లేదంటూ రైతులు కలెక్టరు పిర్యాదు చేశారు.

Read Also:Sangareddy News: వర్షాల నేపథ్యంలో వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

14 మంది హమాలీలు ఉన్నారని, హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందంటూ నిర్వహకులు వివరించారు. గ్రామంలో యాసంగి వరి ధాన్యం గణనీయంగా సాగు చేశారని, మరో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. రాత్రిం భవళ్లు తూకం చేసిన ధాన్యం అలాగే ఉండిపోతుందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, మరో 14 మ ది హమాలీలను సమకూర్చి వెంట వెంటనే తూకం చేయాలని నిర్వహకులను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ. పౌర సరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి రైతులకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ బుచ్చుగూడెం సునీతప్రవీణ్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్ తదితరులున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పాల ఉత్పతి లేకుంటే మనుగడ కష్టం..జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha