Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త బంధాలను వెతుక్కోవడంలో తప్పులేదు: తమన్నా

కొత్త బంధాలను వెతుక్కోవడంలో తప్పులేదు: తమన్నా

వార్త 1 month ago

Tamannaah Bhatia: ప్రేమ, బంధాలపై మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రేమ అనేది కేవలం ఒక్క వ్యక్తితోనే ముగిసిపోవాల్సిన అవసరం లేదని, జీవితంలో ఎన్నిసార్లైనా ప్రేమలో పడొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also :Peddi Movie Trailer: 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

 Tamannaah Bhatia

నచ్చిన వ్యక్తి దొరికే వరకు..

మనసుకు నచ్చిన తోడు దొరికే వరకు కొత్త బంధాలను వెతుక్కోవడంలో తప్పులేదని తమన్నా అభిప్రాయపడ్డారు. ప్రేమలో ఉన్నప్పుడు అది ఇద్దరి ఎదుగుదలకు తోడ్పడాలి తప్ప, స్వేచ్ఛను హరించేలా ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.

ప్రేమ ఒక లావాదేవీ కాదు

ప్రేమలో ఎదుటివారి నుంచి ఏదైనా ఆశించినప్పుడు అది వ్యాపార లావాదేవీలా మారుతుందే తప్ప నిజమైన ప్రేమ కాదని తమన్నా కుండబద్దలు కొట్టారు. విజయ్ వర్మతో బ్రేకప్ రూమర్ల నడుమ ఆమె చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీశాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

విశ్వంభర'లో అవనిగా త్రిష.. మెగాస్టార్ సినిమా నుంచి బర్త్ డే సర్ప్రైజ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha