రాఘవ్ చద్దా పోస్ట్‌తో రాజకీయాల్లో చర్చ
Raghav chadha new party : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల పార్లమెంటులో కీలక ప్రశ్నలను లేవనెత్తిన ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఇప్పుడు రాజకీయ ఊహాగానాలకు దారితీస్తోంది.
కొత్త పార్టీపై నెటిజన్ల సలహా
రాఘవ్ చద్దా షేర్ చేసిన వీడియోలో ఓ యువకుడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాఘవ్ చద్దా మరో పార్టీలో చేరడం కన్నా యువతకు దగ్గరగా ఉండేలా "జెన్‌జెడ్ పార్టీ" లాంటి పేరుతో సొంతంగా పార్టీ స్థాపిస్తే మంచిదని సూచించాడు. యువత మీకు పూర్తి మద్దతు ఇస్తుందని, మీరే గెలుస్తారని పేర్కొన్నాడు. ఈ వీడియోను రాఘవ్ చద్దా "ఇంట్రెస్టింగ్ ఐడియా" అంటూ రీపోస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఆప్‌తో దూరం పెరుగుతోందా?
ఇటీవల రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించడంతో ఆప్‌తో ఆయనకు దూరం పెరిగిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన బీజేపీలో చేరే అవకాశాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగా కొత్త పార్టీ స్థాపించాలంటే బలమైన కేడర్, ఆర్థిక వనరులు, క్షేత్రస్థాయి నిర్మాణం అవసరం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also:Nellore: మరణించిన పోలీసు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కుల అందజేత
Raghav chadha new partyపంజాబ్ ఎన్నికలపై ప్రభావం?
వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాఘవ్ చద్దా రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యత్వం 2028 సెప్టెంబర్ వరకు ఉంది. దీంతో ఆయన నిజంగానే కొత్త పార్టీ పెడతారా లేదా అనే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చూడండి ఏంపీడీఓ మౌనిక

