Medak: మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లి లో డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా సర్పంచ్ల పురం ఉపాధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినారు.
మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సర్పంచులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. మండల కేంద్రమైన కౌడిపల్లి లో సర్పంచ్ల ఫోరం మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రయాణికుల తోపాటు గ్రామపంచాయతీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Read also: Civil Supply DM Jagadish : మెదక్ పెద్ద శంకరంపేటలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Medak: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతికి ఘన నివాళి
బడుగు బలహీనుల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆయన ఆశయ సాధన స్ఫూర్తితో తన ఐదేళ్ల సర్పంచి పదవి కాలంలో బడుగు, బలహీనుల, పేద ప్రజలకు అన్ని విధాల అండదండలుగా ఉంటూ, విధులు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈయనతోపాటు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామ్ గౌడ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమ షేకులు, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచ్లు నాయకులు రాగుల భూమయ్య పటేల్, కౌడ శ్రీనివాస్ గుప్తా, మల్లికార్జున్ గౌడ్, రమేష్ గౌడ్, బండ సాయి గౌడ్, కంచన్పల్లి శివకుమార్ యాదవ్, బాన్సువాడ మహిపాల్ రెడ్డి, తిమ్మాపూర్ శ్రీహరి గౌడ్ లతోపాటు ఆయా గ్రామాలకు చెందిన అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

