Lalaguda Couple Suicide: హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కొద్దిసేపటి వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర ఆవేదన, శోకసంద్రం అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన లక్ష్మి (25), శరణప్ప (30) దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి లాలాగూడ ప్రాంతంలో నివాసముంటున్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన లక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Read Also : Mahabubnagar Accident: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన డీసీఎం.. 200 మేకలు సజీవ దహనం
husband commits suicide, unable to bear his wife’s death.
Lalaguda Couple Suicide: భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఘాతుకం
భార్య లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త శరణప్ప తీవ్ర దిగ్భ్రాంతికి, మనస్తాపానికి గురయ్యాడు. భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక ఆయన నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు కొద్ది వ్యవధిలోనే తనువు చాలించడంతో వారి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు, కలహాలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు కుటుంబ సభ్యులను, స్థానికులను విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
మీరేం విద్యార్థులు!.. స్కూల్‌కు సెలవు కోసం ఇంత పని చేస్తారా?

