Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTRను ఆ ఇద్దరు భామలు బాగా గుర్తుపెట్టుకుంటారు - చామల

KTRను ఆ ఇద్దరు భామలు బాగా గుర్తుపెట్టుకుంటారు - చామల

వార్త 1 month ago

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ కుమార్ ఘాటైన కౌంటరిచ్చారు.

సెలబ్రిటీల ప్రస్తావన తెస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also : Meghalaya Honeymoon Murder Case Bail: మేఘాలయ హనీమూన్ హత్య కేసు.. సోనమ్‌కు బెయిల్ మంజూరు

తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనను ఎవరూ గుర్తించడం లేదని, ఆయనను ప్రజలు త్వరలోనే మర్చిపోతారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన ఎంపీ చామల కిరణ్ కుమార్, కేటీఆర్ గతంలో చేసిన కార్యక్రమాలను ఎండగట్టారు. “అవును, కేటీఆర్ గారిని కొందరు బాగా గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అషు రెడ్డి లాంటి వారితో డ్యాన్సులు వేయించినందుకు, గ్లామర్ షోలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు వారు మిమ్మల్ని మర్చిపోరు” అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ పాలన ప్రజల కోసం కంటే హంగూ ఆర్భాటాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

 Ashureddy

రకుల్ ప్రీత్, అషు రెడ్డి ప్రస్తావన.. అసలు ఉద్దేశం ఇదేనా?

బీఆర్ఎస్ హయాంలో చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహరించిన విషయం తెలిసిందే. దీనిపై చామల స్పందిస్తూ, చేనేత కార్మికుల సంక్షేమం కంటే రకుల్ ప్రీత్ సింగ్‌తో ర్యాంప్ వాక్ చేయించడానికే కేటీఆర్ ఎక్కువ ఆసక్తి చూపారని విమర్శించారు. సెలబ్రిటీలను తీసుకొచ్చి ప్రచారం చేసుకోవడం వల్ల సామాన్యులకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఇద్దరు భామలు (రకుల్, అషు రెడ్డి) కేటీఆర్‌ను గుర్తుపెట్టుకోవచ్చు కానీ, తెలంగాణ సామాన్య ప్రజలు మాత్రం కేటీఆర్ కంటే రేవంత్ రెడ్డిని తమ గుండెల్లో పెట్టుకున్నారని చామల వ్యాఖ్యానించారు.

ప్రజల గుండెల్లో రేవంత్

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం రేవంత్ రెడ్డి పోరాట పటిమకు నిదర్శనమని చామల కొనియాడారు. కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకు, ధనిక వర్గాలకు పరిమితమయ్యారని.. రేవంత్ రెడ్డి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు గుర్తించడం లేదని కేటీఆర్ అంటున్నారంటే, ఆయనకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పులు కనిపించడం లేదని అర్థమవుతోందని విమర్శించారు. మా నాయకుడు ప్రజల మనిషి అని, మీలాగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ నాయకుడు కాదని చామల కిరణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణపై కసరత్తు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha