Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుక్కల రక్తంతో దందా అనేది అబద్ధం.. పెట్స్ కేర్ ఛైర్మన్ వెంకట్ యాదవ్

కుక్కల రక్తంతో దందా అనేది అబద్ధం.. పెట్స్ కేర్ ఛైర్మన్ వెంకట్ యాదవ్

వార్త 1 month ago

Dogs Blood Trade Rumors: హైదరాబాద్‌లోని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై వస్తున్న ఆరోపణలను ఆ సంస్థ ఛైర్మన్ వెంకట్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.

ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కుక్కల రక్తంతో వ్యాపారం జరుగుతోందన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Srisailam temple: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో చలివేంద్రాలు ఏర్పాటు

 The dog blood scam is a blatant lie.. Venkat Yadav

Dogs Blood Trade Rumors: రక్తం మనుషులకు పనికిరాదు.. దందాకు అవకాశమే లేదు!

కుక్కల రక్తం మనుషులకు ఏ రకంగానూ ఉపయోగపడదని, అలాంటప్పుడు దానితో దందా చేయడం ఎలా సాధ్యమని వెంకట్ యాదవ్ ప్రశ్నించారు. కేవలం కుక్కలకు క్యాన్సర్, టిక్ ఫీవర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకినప్పుడు, రక్తం తక్కువైన అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇతర కుక్కల నుంచి రక్తం సేకరించి ఎక్కిస్తామని వివరించారు. ఇది పూర్తిగా వైద్యపరమైన ప్రక్రియ అని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని తేల్చి చెప్పారు.

సిబ్బంది కుట్రపై పోలీసులకు ఫిర్యాదు

తమ ఆస్పత్రి రిఫరల్ హాస్పిటల్‌గా ఎదుగుతుండటాన్ని ఓర్వలేక కొందరు ఈ దుష్ప్రచారానికి తెరలేపారని ఆయన ఆరోపించారు. ఆరు నెలల క్రితం చేరిన కొంతమంది సిబ్బంది, ఇతర ఆస్పత్రుల వారితో చేతులు కలిపి ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్ ఫోటోలు, వీడియోలను తప్పుగా చిత్రీకరించి బయటపెట్టారని వెల్లడించారు. ఈ కుట్రకు పాల్పడిన డాక్టర్లు, స్టాఫ్‌పై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, వారిపై పరువు నష్టం దావా కూడా వేస్తామని హెచ్చరించారు.

15 ఏళ్ల నమ్మకం.. లక్షల చికిత్సలు

గత 15 ఏళ్లుగా తమ ఆస్పత్రి నిరంతరాయంగా సేవలు అందిస్తోందని, ఇప్పటి వరకు లక్షలాది మూగజీవాలకు సర్జరీలు, చికిత్సలు చేశామని వెంకట్ యాదవ్ గుర్తు చేశారు. ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగిన తనపై అసూయతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంపుడు జంతువుల యజమానులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అత్తపై అల్లుడి కిరాతకం.. ఏం చేసాడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha