Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కులం ప్రస్తావనపై అశ్విన్ 'గూగ్లీ': ట్రోలర్ నోరు మూయించిన టీమిండియా స్పిన్నర్

కులం ప్రస్తావనపై అశ్విన్ 'గూగ్లీ': ట్రోలర్ నోరు మూయించిన టీమిండియా స్పిన్నర్

వార్త 3 months ago

Ravichandran Ashwin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలు కైవసం చేసుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ చారిత్రాత్మక విజయంపై రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. "నేను కేవలం విజయ్ అనే నటుడికే అభిమానిని కాదు.. ఆయన చూపించే బాటలో నడిచే నాయకుడిని అనుసరించాలని కోరుకుంటున్నాను" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసించారు.

Read Also:Satvik Sairaj Comments:పతకాలు తెచ్చినా పలకరించే నాథుడే లేడు.. స్టార్ షట్లర్ సాత్విక్ ఆవేదన

Ravichandran Ashwin: వివాదాస్పద కుల కామెంట్

అయితే అశ్విన్ చేసిన ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ అభ్యంతరకరంగా స్పందించాడు. అశ్విన్ కులాన్ని ప్రస్తావిస్తూ.. "ద్రవిడ పాలన అంటే భయపడే ఓ బ్రాహ్మణుడు" అని కామెంట్ చేస్తూ ఎద్దేవా చేశాడు. ఈ కులపరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.సాధారణంగా మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే అశ్విన్, ఈ ట్రోల్‌పై అత్యంత హుందాగా, అదే సమయంలో ఘాటుగా స్పందించారు.

"నేను ఎక్కడ జన్మించాలనేది నా ఇష్టం కాదు. కానీ మంచి తల్లిదండ్రుల వద్ద పుట్టినందుకు గర్విస్తున్నాను. నాయకత్వం అంటే ఎదుటి వ్యక్తి కష్టాల పట్ల సానుభూతి కలిగి ఉండటం అని నా తల్లిదండ్రులు నేర్పారు. మనం వంశం లేదా కులం గురించి మాట్లాడుకోవడం మానేసే రోజు వరకు నేను బ్రతకాలని కోరుకుంటున్నాను" అని అశ్విన్ రాసుకొచ్చారు.

కులం పేరుతో రెచ్చగొట్టాలని చూసిన ట్రోలర్‌కు అశ్విన్ ఇచ్చిన ఈ పరిణితి చెందిన సమాధానం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక క్రీడాకారుడిగా తన వ్యక్తిత్వాన్ని, సామాజిక బాధ్యతను అశ్విన్ మరోసారి చాటుకున్నారని అభిమానులు కొనియాడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సర్వేలకు అందని ఫలితాలతో పార్టీల్లో అయోమయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha