Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుమారుడుని కాపాడుకోవాలని తల్లితండ్రుల ఆరాటం.. ప్రాణాలతో బయటపడిన అమ్మ

కుమారుడుని కాపాడుకోవాలని తల్లితండ్రుల ఆరాటం.. ప్రాణాలతో బయటపడిన అమ్మ

వార్త 3 months ago

Markapuram Bus Tragedy: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో జరిగిన భీకర బస్సు ప్రమాదం మరిన్ని కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హృదయాలను కలచివేస్తోంది.

తన ఐదు నెలల పసికందును,భర్తను కళ్లెదుటే కోల్పోయిన ఆ మహిళ ఆవేదన వర్ణనాతీతంగా మారింది.దీంతో సదరు మహిళ గుండెలు అవిసేలా రోదిస్తోంది. స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. అనేక కుటుంబాల్లో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది.

Read Also:Wildlife problem : జనంలో వనజీవుల సమస్యకు పరిష్కారమేది?

 Markapuram bus accident death toll

హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు.. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్‌ను ఢీకొట్టింది ట్రావెల్స్‌ బస్సు. బస్సు ఢీకొట్టడంతో టిప్పర్‌ డీజిల్‌ ట్యాంక్‌ నుంచి మంటలు చెలరేగి కొన్ని క్షణాల్లోనే తగలబడిపోయింది. బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడేలోపే పొగతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బస్సు నుంచి దిగడానికి వీల్లేకుండా అగ్నికీలలు వ్యాపించాయి.

బస్సు కండీషన్ బాగానే ఉంది

కానీ ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బస్సు క్లీనర్ మహేంద్ర వాదన మాత్రం మరో రకంగా ఉంది. బస్సు ప్రమాదం నుంచి మొట్టమొదటగా తానే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపాడు. తాను నిద్రపోతున్న సమయంలో ప్రమాదం జరిగిందని.. లేచి చూసేసరికి బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుందని పేర్కొన్నాడు. మంటలను ఆర్పే సిలిండర్లు బస్సులో ఉన్నాయని.. కానీ దట్టమైన పొగ కారణంగా అవి కనిపించలేదని వివరించాడు. చాలా మంది అద్దాలు పగలగొట్టి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారని తెలిపాడు. బస్సు కండీషన్ బాగానే ఉందని క్లీనర్ మహేంద్ర చెప్పాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బిడ్డను కాపాడి సజీవదహనమైన తల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha