Telangana: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 6న బాసర పర్యటనకు సం బంధించి ఏర్పాట్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ముందుగా బాసర చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో పాటు అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగ ణాన్ని పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు మంత్రులకు ఆశీర్వచ నాలు, తీర్థ ప్రసాదాలు అందించారు.
Read Also: Minister Seethakka: గ్రామ సభలు విజయవంతం
Godavari Pushkarams on the lines of Kumbh Mela: Minister Jupally
Telangana: రూ. 300 కోట్లతో అభివృద్ధి పనులు
ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్, ఆలయ అభివృద్ధి పనులు చేపట్టబోయే ప్రాంతాల వివరాలను మంత్రులకు
వివరించారు. ముఖ్య మంత్రి శంకుస్థాపనలు చేయ నున్న ప్రదేశాలను మంత్రులు పరిశీలించి, అధికా రులకు కీలక సూచనలు చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బం దీగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రాజన్న అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాసర అభివృద్ధి పనులకు సంబంధించి రూ.300 కోట్లతో దేవాల యాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన
గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగనున్నాయని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీలు సాయి కిరణ్, ఉపేంద్ర రెడ్డి, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఆలయ ఈవో విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

