Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడ రెయిన్ బో హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది?

విజయవాడ రెయిన్ బో హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది?

వార్త 2 weeks ago

Vijayawada Rainbow Hospital: విజయవాడ లో బుధవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. ప్రముఖ రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.

ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది, ఆ వార్డులో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను హుటాహుటిన వేరే సురక్షిత వార్డుల్లోకి తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో ఉన్న చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందోనని తీవ్ర ఆందోళన చెందారు. ఆస్పత్రి ప్రాంగణంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

Read Also : Nellore Dowry Harassment:అదనపు కట్నం వేధింపులు.. భార్యపై దాడి!

 Fire at Rainbow Hospital in Vijayawada… What exactly happened?

Vijayawada Rainbow Hospital: రంగంలోకి ఫైర్ సిబ్బంది.. మంటలు అదుపులోకి

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, ఆస్పత్రి సిబ్బంది సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాద ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రత, నష్టాన్ని అంచనా వేసేందుకు ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యం నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జ్ఞానేశ్వరి కేసులో సంచలన మలుపు.. బొమ్మలతో కొత్త ప్రయోగం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha