Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లాభాల బాటలో స్విగ్గీ.. ఏకంగా 45 శాతం వృద్ధి!

లాభాల బాటలో స్విగ్గీ.. ఏకంగా 45 శాతం వృద్ధి!

వార్త 2 weeks ago

Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించింది. గతంలో ఉన్న రూ.1,081 కోట్ల నష్టం ఇప్పుడు రూ.800 కోట్లకు తగ్గింది.

కంపెనీ తన ఖర్చులను నియంత్రించుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. వ్యాపార నిర్వహణలో తీసుకున్న కీలక నిర్ణయాలు సంస్థకు మంచి ఫలితాలను ఇచ్చాయి.

Read also: Spam Calls: మీకు రోజూ స్పామ్ కాల్స్ వస్తున్నాయా? ఇలా చేయండి!

 Swiggy’s Losses Decline

Swiggy: ఆదాయంలో 45 శాతం పెరుగుదల

స్విగ్గీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 45 శాతం పెరిగి రూ.6,383 కోట్లకు చేరుకుంది. ఫుడ్ డెలివరీ ఆర్డర్ల విలువ కూడా 22.6 శాతం వృద్ధి చెంది రూ.9,006 కోట్లుగా నమోదైంది. వినియోగదారులు ఎక్కువగా ఆర్డర్లు చేయడమే ఈ వృద్ధికి ప్రధాన కారణం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో స్విగ్గీ సేవలకు ఆదరణ బాగా పెరిగింది.

స్నాక్ వ్యాపారానికి గుడ్ బై

ఫుడ్ డెలివరీలో లాభాలు వస్తున్నా స్విగ్గీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. త్వరగా డెలివరీ చేసే ‘స్నాక్’ (Snack) సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వనరులను మరింత సమర్థవంతంగా వాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పూర్తిస్థాయిలో ఫుడ్, గ్రోసరీ డెలివరీపైనే కంపెనీ దృష్టి పెట్టనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఖాతాదారుల కోసం ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha